Keshineni Nani:కేశినేని నాని దారెటు..? టీడీపీలోనే ఉంటారా..? జంప్ అవుతారా..?
Send us your feedback to audioarticles@vaarta.com
విజయవాడ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) వ్యవహారం కృష్ణా జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా తనను తప్పించారని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్‌పై జోరుగా చర్చ జరుగుతోంది. టీడీపీలోనే కొనసాగుతారా.. వైసీపీలోకి వెళ్తారా.. బీజేపీ వైపు చూస్తారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి కేశినేని వ్యవహారశైలి భిన్నంగా ఉండేది. ప్రజారాజ్యం(Praja Rajyam) పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన మూడు నెలలకే ఆ పార్టీ ఆఫీసులోనే ప్రెస్‌మీట్ పెట్టి అధ్యక్షుడు చిరంజీవి(Chiranjeevi)పై తీవ్ర విమర్శలు చేశారు.
అనంతరం 2009లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2019లో వైసీపీ గాలిలోనూ రెండోసారి ఎంపీగా గెలిచారు. అయితే 2017లో కేశినేని ట్రావెల్స్ విషయంలో అప్పటి రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యంతో వివాదం చెలరేగింది. చంద్రబాబు(Chandra Babu) వార్నింగ్ ఇవ్వడంతో వెనక్కు తగ్గారు. అనంతరం దశాబ్దాల చరిత్ర ఉన్న ట్రావెల్స్ బిజినెస్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచే ఆయన వ్యవహారశైలి మారుతూ వచ్చింది. సందర్భం వచ్చినప్పుడల్లా అధిష్టానంతో పాటు, స్థానిక నేతలపై విమర్శలు చేసేవారు.
అలాగే టీడీపీ ప్రత్యర్థులైన వైసీపీ నేతలతో కలిసి తరుచూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పు ఏంటని ఎదురు ప్రశ్నించేవారు. తనకు అన్ని పార్టీల నేతలు మిత్రులేనని.. రాజకీయాలు వేరు.. అభివృద్ధి.. వేరు అని వివరించేవారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరిగింది. ఇదే క్రమంలో ఆయన తమ్ముడు చిన్ని రాజకీయాల్లో యాక్టివ్ కావడం నానికి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చాయి. చంద్రబాబు, లోకేష్(Lokesh) కూడా చిన్నిని ప్రోత్సహించడం చేశారు. దీంతో అన్నదమ్ములు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేశినేని నానిని పక్కనపెట్టారు.
ప్రస్తుతానికి అధినేత మాట శిరసావహిస్తానని చెప్పిన కేశినేని.. ఎప్పుడూ ఎలాంటి బాంబ్ పేల్చుతారో తెలియదు. వైసీపీ(YCP) నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేయమని ఆఫర్ వస్తే మాత్రం ఆయన జంప్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నారని చెబుతున్నారు. పార్టీ మార్పు వార్తలపై మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తినబోతూ రుచులెందుకు అన్ని విషయాలు ఒకే రోజెందుకు? అని తెలిపారు. ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే ఇంకొకటి చూసుకోవాలి కదా. ఏ ఫ్లైట్ ఖాళీ లేకపోయితే ప్రైవేట్ జెట్‌లోనైనా వెళ్లాలి అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలుస్తానని గతంలోనే చెప్పానని.. మూడోసారి ఎంపీగా గెలిచి ఢిల్లీ వెళ్లడం ఖాయమని స్పష్టంచేశారు.
ఆయన మళ్లీ ఎంపీగా గెలుస్తానని చెప్పడం చూస్తుంటే వైసీపీ లేదా బీజేపీ(BJP)లోకి ఆ పార్టీల పోటీ చేయడం లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమనే చెప్పాలి. మొత్తానికి కేశినేని నాని వ్యవహారం కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు రేపుతుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments