హీరో నిఖిల్ కేశవ ప్రీ లుక్ రిలీజ్..!

  • IndiaGlitz, [Thursday,December 22 2016]

ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా సినిమాతో సంచ‌ల‌న విజ‌యం సాధించిన నిఖిల్ త‌దుప‌రి చిత్రం కేశ‌వ‌. ఈ చిత్రాన్ని స్వామి రా రా ఫేమ్ సుధీర్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై అభిషేక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రివేంజ్ ల‌వ్ స్టోరీగా రూపొందుతున్న కేశ‌వ ప్రీ లుక్ ను ఈ రోజు బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. రివేంజ్ ఈజ్ ఏ డిష్..బెస్ట్ స‌ర్వ‌డ్ కోల్డ్ అనే క్యాప్ష‌న్ తో రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్ట‌ర్ కు విశేష స్పంద‌న ల‌భిస్తుంది. ప్ర‌తికారం నేప‌ధ్యంతో సాగే విభిన్న క‌థా చిత్ర‌మ‌ని ఈ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. ఈనెల 24న ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. వైవిధ్య‌మైన క‌థలు ఎంచుకుని విజ‌యం సాధిస్తున్న నిఖిల్ కేశ‌వ సినిమాతో కూడా మ‌రో స‌క్సెస్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం..!