హీరోగా పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న నిఖిల్..
Wednesday, May 17, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఏవిదమైమన బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలో ఎంట్రి ఇవ్వటమే కష్టంగా వున్న ఈ రోజుల్లో తన టాలెంట్ ని తన మీద తనకున్న నమ్మకంతో "హ్యపిడేస్" చిత్రం లో నలుగురిలో ఒక్కడిగా తెలుగు తెరకి పరిచయమయ్యిన నిఖిల్ ఈ సంవత్సరం తో తన కెరీర్ లో పది సంవత్సరాల మైలు రాయిని దాటుతున్నాడు. "హ్యపిడేస్" చిత్రంలో రాజేష్ గా అల్లరి చిల్లరి కుర్రాడుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఆ తరువాత తన కెరీర్ ని ఎలా తిప్పుకోవాలో అనే విషయంలో కొంత ఇబ్బంది పడినా యువత తో కమర్షియల్ సక్సస్ ని అందుకున్నాడు. దాంతో వరుసగా కళావర్ కింగ్, వీడు తేడా వంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రాలతో హీరోగా నిలదొక్కుకున్నాడు.
కమర్షీయల్ హీరోగా రాణిస్తున్న టైమ్ లో సుదీర్ వర్మ దర్శకుడిగా చేసిన "స్వామిరారా" చిత్రంతో ప్రేక్షకుల హ్రుదయాలని ఆకట్టుకున్నాడు. తెలుగు సినిమా చరిత్రలో ఓ కొత్త ఒరవడి సృష్టించారు నిఖిల్. అన్ని భాషల్లో కొత్త తరహ చిత్రాలు వస్తున్నాయి మన తెలుగు లో ఎందుకు రావట్లేదు, వచ్చినా ఎందుకు కమర్షియల్ గా ఆదరణ పొందటం లేదు అనే దానికి పెర్‌ఫెక్ట్ ఉదాహరణ "స్వామిరారా" ఘనవిజయం.. ఈ విజయంతో ఓక్కసారిగా తెలుగు దర్శకులు నిఖిల్ వైపు చూడటం మెదలు పెట్టారు. ఆ వెంటనే వైవిధ్యమైన కథాంశంతో "కార్తికేయ" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు దర్శకుడు చందు మెండేటి. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలు అనే తేడా లేకుండా ఘనవిజయాన్ని అందించటంలో తెలుగు సినిమా అభిమానులు ఎప్పుడూ ముందుంటారు.
"కార్తికేయ" చిత్రం తరువాత వచ్చిన "సూర్య వర్సెస్ సూర్య" తో వరుసగా హ్యట్రిక్ ఘనవిజయాలు సాధించారు నిఖిల్ అంతేకాదు నిఖిల్ చిత్రం అంటే ఓ వైవిధ్యమైన చిత్రం మాత్రమే వుంటుందనే భారీ అంచనాలకు వచ్చేశారు ప్రేక్షకులు. "మనిషి బరువేంత వున్నా మరణానంతరం 21గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది" అనే లీడ్ తో "ఎక్కడకి పోతావు చిన్నవాడా" వంటి డిఫరెంట్ కంటెంట్ ఉన్న చిత్రం చేశాడు. డీమానిటైజేషన్ టైంలో ప్రేక్షకులు చిల్లర కష్టాలు పడుతూ మంచి చిత్రానికి అద్బుతమైన ఘనవిజయాన్ని అందించారు. దాదాపు 38కొట్లకి పైన ధియేట్రికల్ షేర్ తో 40కొట్ల బిజినెస్ చేసి నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సస్ ని అందించారు. కథల్ని ఎంచుకొని రెగ్యూలర్ ఇమేజ్ ఛట్రంలో ఇరుకొక్కుండా తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు నిఖిల్.
" గొప్పగా కొత్తగా చెప్పటానికి నాది కథ కాదు బాధ.. నాకొ ప్రాబ్లమ్ వుంది. అందరికి ఎడమ వైపు వుండాల్సిన గుండే నాకు కుడి వైపు వుంది" అంటూ కేశవ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్న నిఖిల్. ఈ సినిమా తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచిన స్వామిరారా డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కింది. మే 19న ఈ సినిమా విడుదల కాబోతుంది. అలానే హీరోగా నిఖిల్ ఇప్పుడు 10వ సంవత్సరంలో దూసుకుపోతున్నారు. కేశవ తరువాత ఇలాంటి మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడని ఆశిద్దాం..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments