సదరన్ స్టార్ అల్లు అర్జున్ కి గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన మల్లూవుడ్

  • IndiaGlitz, [Saturday,November 10 2018]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కేరళ అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈరోజు కేరళలోని అలప్పుఝా వద్ద ఉన్న పున్నామ్ద సరస్సులో జరిగిన ప్రతిష్టాత్మక 66వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా.... ఆయన సతీమని అల్లు స్నేహారెడ్డితో కలిసి హాజరయ్యారు. కేరళ ప్రజలు తమ అభిమాను హీరోకు కొచ్చి ఎయిర్ పోర్ట్ నుంచే గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. మల్లూ వుడ్ లో అల్లు అర్జున్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

తన అభిమానులకు ఎంతో ఇష్టమైన నలుపు రంగు డ్రెస్ లో పలకరించడంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. బోట్ రేస్ కార్యక్రమానికి తెల్లటి దుస్తుల్లో... అచ్చమైన కేరళవాసిగా దర్శనమిచ్చి అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ పళనిసామి సదాశివం హాజరయ్యారు. ఆయనతో కలిసి అల్లు అర్జున్ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటీవల కేరళలో సంభవించిన వరదలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ నష్టాన్ని పూడ్చేందుకు విరాళాల సేకరణ కోసం ఈ ఈవెంట్ ను కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.