Amala Paul:గుడిలోకి అడుగుపెట్టనివ్వని పూజారులు.. అమలాపాల్‌కు ఘోర అవమానం, వివక్ష పోలేదంటూ హీరోయిన్ ఆవేదన
Send us your feedback to audioarticles@vaarta.com
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం అగ్రరాజ్యాల సరసన నిలుస్తున్నా.. ఇంకా దేశంలో మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. నరబలులు, క్షుద్రపూజలు, మంత్రాలు అనే వార్తలు నిత్యం ఏదో మూల వినిపిస్తూనే వుంటాయి. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత ఎందరో మహనీయులు కులాలు, మతాల మధ్య వున్న అంతరాలను తగ్గించేందుకు .. అంటరానితనాన్ని నివారించేందుకు ఎంతో కృషి చేశారు. కానీ నేటికీ భారతీయ సమాజంలో ఈ అంతరాలు తగ్గడం లేదు. ఇక.. ఇప్పటికీ మన దేశంలోని కొన్ని హిందూ దేవాలయాలలో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఇతర మతస్తులను దేవాలయాల్లోకి అనుమతించకపోడం ఇందులో ప్రధానమైనది. పూజారులు, దేవాలయాల కమిటీలు ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నాయి.
విజిస్టర్ రిజిస్టర్లో అమలాపాల్ ఆవేదన:
అయితే పలువురు ప్రముఖులు కూడా ఆలయ ప్రవేశం విషయంలో అవమానాలను ఎదుర్కొన్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో స్టార్ హీరోయిన్ అమలాపాల్ చేరారు. స్వతహాగా క్రైస్తవ మతస్తురాలైన ఆమెకు కేరళలోని ఓ ఆలయంలోకి ఎంట్రీ దొరకలేదు. ఎర్నాకులంలోని తిరువైరానికులం మహాదేవ ఆలయంలోకి అమలాపాల్ ప్రవేశానికి అక్కడి పూజారులు అనుమతించలేదు. ఈ ఆలయంలోకి కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం వుంటుందని, మిమ్మల్ని అనుమతించేది లేదని పూజారులు స్పష్టం చేశారు. తనకు జరిగిన అవమానాన్ని అమలాపాల్ ఆలయంలోని విజిటర్స్ రిజిస్టర్లో తెలియజేశారు.
2023లోనూ ఇలాంటి వివక్షలేంటీ :
తనను ఆలయంలోకి అనుమతించకపోయినప్పటికీ.. మనసులోనే అమ్మవారిని ప్రార్ధించానని చెప్పారు. 2023లలోనూ ఇంకా సమాజంలో మతపరమైన వివక్ష కొనసాగుతోందంటే నమ్మశక్యంగా లేదంటూ అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం నుంచి ఈ వివక్ష పోవాలని ఆమె ఆకాంక్షించారు. మరోవైపు అమలాపాల్‌కు దేవాలయంలో జరిగిన అవమానం విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఆమెకు మద్ధతుగా పోస్ట్‌లు పెడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com