కేరళ విమాన ప్రమాదం: గర్భిణి సహా 23 మంది పరిస్థితి విషమం
Send us your feedback to audioarticles@vaarta.com
కేరళ విమానం ప్రమాదానికి గల కారణాలతో పాటు అన్ని వివరాలనూ అధికారులు సేకరిస్తున్నారు. మృతులను గుర్తించే పనులు వేగంగా సాగుతున్నాయి. విమాన ప్రమాదంలో ఇప్పటివరకూ 19 మంది మరణించినట్లు పౌర విమానయాన శాఖ అధికారులు ధృవీకరించారు. ఇప్పటికే చనిపోయిన 19 మందిలో 18 మందిని గుర్తించారు. కాగా మిగిలిన 171 మంది వివిధ ఆసుపత్రులలో ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా.. వారిలో గర్భిణి.. నలుగురు చిన్నారుల సహా మొత్తం 23 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. విమాన ప్రమాదంపై విచారణ కోసం అధికారులు రెండు బృందాలను నియమించారు. వీటిలో ఒకటి కోజికోడ్ చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం వరకూ మరో బృందం చేరుకోనుందని వెల్లడించారు. విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మరికాసేపట్లో కేరళ సీఎం పినారాయ్ విజయన్ సందర్శించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
కేంద్ర మంత్రి మురళీధరన్ ఇప్పటికే ప్రమాద స్థలానికి చేరుకుని.. ప్రమాదం గురించి అధికారులతో చర్చిస్తున్నారు. ఈ విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 18 మందిని గుర్తించగా.. ఇంకొకరిని గుర్తించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మరణించిన వారికి.. కోవిడ్ -19 ప్రోటోకాల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం అధికారులు పోస్ట్‌మార్టం చేయనున్నట్లు వెల్లడించారు. ఎయిర్ ఇండియా నియమించిన విచారణ బృందం ఉదయం 11:00 గం.లకు తరువాత కోజికోడ్ చేరుకుంటుందని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి.. ఘటన కారణాలు, విమానం నుంచి బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకోవడం, ఇతర కారణాలు అధికారులు అన్వేషించనున్నారు. కోజికోడ్ విమాన ప్రమాద ప్రదేశాన్ని కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి పరిశీలించనున్నారు. మరికాసేపట్లో ఢిల్లీ నుంచి కోజికోడ్ బయలుదేరుతున్నట్లు పౌర విమానయాన శాఖ అధికారులు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments