కేరళ సీఎంకు షాక్.. బంగారం స్మగ్లింగ్‌తో సంబంధం నిజమేనట..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల ముందు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌కు ఊహించని షాక్ తగిలింది. 30 కేజీల బంగారం స్మగ్లింగ్ వ్యవహారంతో పినరయ్‌కు సంబంధముందని ప్రతిపక్షాలన్నీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విషయాన్ని నేడు ఈ కేసులో నిందితురాలైన స్వప్న సురేష్ సైతం బలపరిచారు. కస్టమ్స్ అధికారుల దర్యాప్తులో భాగంగా స్వప్న సురేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ స్మగ్లింగ్‌లో సీఎం పినరయ్ విజయన్ పాత్ర కూడా ఉందని కస్టమ్స్ అధికారులకు చెప్పారు. సీఎం పినరయ్‌తో పాటు మరో ముగ్గురు మంత్రుల పేర్లను కూడా స్వప్నా సురేశ్ విచారణ సందర్భంగా బయటపెట్టారు.
మొత్తంగా ఈ వ్యవహారంలో సీఎంతో పాటు ముగ్గురు మంత్రులు.. స్పీకర్ పాత్ర కూడా ఉందని స్వప్న వెల్లడించారు. ఈ విషయాన్ని కస్టమ్స్ అధికారులు కేరళ హైకోర్టుకు కూడా వెల్లడించారు. సీఎం విజయన్ అరబ్బీ భాషలో మాట్లాడలేరని... అందుకే కాన్సులేట్ జనరల్‌కు, సీఎం విజయన్‌కు మధ్య ట్రాన్స్‌లేటర్‌గా స్వప్న సురేష్ వ్యవహరించారని కస్టమ్స్ అధికారులు కోర్టుకు వెల్లడించారు. ఈ డీల్‌లో సీఎం సహా మంత్రులకు కోట్లాది రూపాయలు కమిషన్‌గా ముట్టిందని స్వప్న సురేశ్ తమ దర్యాప్తులో భాగంగా స్పష్టం చేసినట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో 30 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సుమారు రూ.15 కోట్ల విలువైన 30 కేజీల బంగారం యూఏఈ నుంచి కేరళలోని రాయబార కార్యాలయం పేరుతో వచ్చింది. ఈ స్మగ్లింగ్‌లో స్వప్న సురేష్ అనే మహిళ ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఆమె యూఏఈ క్యాన్సులేట్‌లో గతంలో పనిచేశారు. అలాగే, కేరళ ప్రభుత్వ ఐటీ శాఖకు అనుబంధంగా ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనీకి మార్కెటింగ్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. అయితే ఈ వ్యవహారం కాస్తా అటు తిరిగి.. ఇటు తిరిగి ఎన్నికల ముందు సీఎం మెడకు చుట్టుకోవడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com