అల్లు అర్జున్ కు కేరళ 'సి ఎం' ఆహ్వానం
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలో కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. బన్నీ నటించిన చిత్రాలన్నీ ఇక్కడ ఏ రేంజ్ లో ఆడతాయో అక్కడకూడా అదే రేంజ్ లో ఆడుతాయంటే కేరళ లో బన్నీకి అభిమానులు ఎంత మంది ఉన్నారో అంచనా వేయొచ్చు. అలాగే ఈ మధ్య కేరళలో జరిగిన వరద భీభత్సానికి బన్నీ తన వంతు సహాయంగా 25 లక్షల రూపాయలు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాడు.
అయితే ఇప్పుడు తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నుంచి మన స్టైలిష్ స్టార్ బన్నీ కి ఆహ్వానం అందింది. ఇంతకీ ఆ ఆహ్వానం ఏంటని అనుకుంటున్నారా? కేరళలో ప్రతి ఏటా జవహర్ లాల్ పండిట్ పేరు మీద కేరళ ప్రభుత్వం బోట్ రేస్ పోటీలు నిర్వహిస్తుంది. దాదాపు 65 ఏళ్ల చరిత్ర కలిగిన నెహ్రు బోట్ రేస్ పోటీలకు ముఖ్య అతిథి గా హాజరు కావాలని అల్లు అర్జున్ కు ఆహ్వానం వచ్చింది. ఈ బోట్ రేస్ పోటీలు కేరళ లోని అలప్పుజ ప్రాంతం లో గల పున్నమ్ దా సరస్సు మీద ఈ నెల నవంబర్ 10న జరగనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments