కేరళలో సర్ధార్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్. బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈనెల 5 నుంచి సర్ధార్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో పవన్, కాజల్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నెలాఖరు వరకు ఈ సెట్ లో షూటింగ్ చేయనున్నారు.
తదుపరి షెడ్యూల్ షూటింగ్ కోసం కేరళ వెళ్లనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి వారం రోజులు పాటు కేరళ లో షూటింగ్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. సర్థార్ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com