Kejriwal: తిహార్ జైలుకు కేజ్రీవాల్.. 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ..
Send us your feedback to audioarticles@vaarta.com
లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. ఆయనకు మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను తిహార్ జైలుకు తరలించనుండగా ఈనెల 15వరకు అక్కడే ఉండనున్నారు. ఇప్పటికే ఇదే కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు.
నేటితో ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. దర్యాప్తుకు కేజ్రీవాల్ సహకరించడం లేదని.. డిజిటల్ పరికరాల పాస్ వర్డ్స్ ఇవ్వడం లేదని ఈడీ తరపు న్యాయవాది ఎస్వీరాజు వాదించారు. ఈడీ వాదనను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
కాగా ఈ కేసులో 9 సార్లు ఈడీ సమన్లు జారీచేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపర్చగా తొలుత ఏడు రోజులు, ఆ తర్వాత నాలుగు రోజుల కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది.
ఈ క్రమంలోనే ఈడీ అరెస్టు చేసినందున కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని సామాజికవేత్త సుర్జీత్ సింగ్ యాదవ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ముఖ్యమంత్రిని తొలగించే అంశంపై న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోలేదని స్పష్టంచేసింది. దీంతో కేజ్రీవాల్‌కు కాస్త ఊరట దక్కింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments