ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌కు ఊహించని షాక్..!
- IndiaGlitz, [Saturday,May 04 2019]
ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఊహించని షాక్ తగలింది. శనివారం సాయంత్రం లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలోని మోతీనగర్‌లో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఈ రోడ్డు షోలో కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి హఠాత్తుగా దాడి చేశారు. సీఎం జీపులోని ఓపెన్ టాప్ ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా పైకి దూసుకెళ్లిన యువకుడు ఆయన చెంప చెల్లుమనిపించాడు. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్న నేతలు, ఆప్ కార్యకర్తలు ఒక్కసారిగా షాకయ్యారు. అప్రమత్తమైన కార్యకర్తలు కేజ్రీవాల్‌పై దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాదిన పోలీసులకు అప్పగించారు. ఘటనను ఆప్ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాగా కేజ్రీవాల్‌కు ఇలా చేదు ఘటనలు ఎదురవ్వడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ చెప్పులు, సిరాతో పలుమార్లు దాడులు జరిగాయి.
కాగా ఈ మధ్య నేతలపై దాడులు ఎక్కువవుతున్నాయి. హార్థిక్ పటేల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుండగా నేరుగా వచ్చిన ఓ వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే దాడి ఎందుకు చేశానో క్లుప్తంగా మీడియాకు వివరించిన విషయం విదితమే. ఆ తర్వాత బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహారావుపై ఓ డాక్టర్ చెప్పు విసిరిన సంగతి తెలిసిందే. ఇలా వరుస ఘటనలు జరగడంతో నేతలు ప్రచారానికి వెళ్లాలంటే బెంబేలెత్తిపోతున్నారు.
#Shocking : A man slaps #Delhi Chief Minister #ArvindKejriwal during his roadshow in Moti Nagar area #LoksabhaElections2019 #2019Elections #AAP pic.twitter.com/70jKINHnZA
— Anusha Puppala (@anusha_puppala) May 4, 2019