కీర్తి సురేష్ 'పెంగ్విన్'
- IndiaGlitz, [Thursday,October 17 2019]
కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్‌గానటిస్తున్న హీరోయిన్ కీర్తి సురేశ్ రేంజ్ 'మహానటి'తో మారిపోయింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్ అలనాటి మహానటి సావిత్రి పాత్రలో కనపడ్డారు. సావిత్రి బయోపిక్‌లో కీర్తి నటనకు అందరూ శభాష్ అన్నారు. ఈ చిత్రం తర్వాత కీర్తి సురేశ్ సినిమాల ఎంపికలో అచితూచి వ్యవహరిస్తుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కీర్తిసురేశ్ కేరాఫ్ అడ్రస్ అయ్యింది.
ఇప్పుడు కీర్తిసురేశ్ ప్రధానపాత్రలో మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు రూపొందుతున్నాయి. అందులో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలోఓ సినిమా రూపొందుతుంది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలవుతుంది. శరవేగంగా చిత్రీకరణనను జరుపుకుంటుంది. ఈ చిత్రానికి 'పెంగ్విన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆ సినిమా టైటిల్ లుక్‌ను నేడు కీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.
'పెంగ్విన్'తో పాటు కీర్తిసురేశ్ 'మిస్ ఇండియా' అనే మరో లేడీ ఓరియెంటెడ్ మూవీలోనూ.. నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో మరో సినిమా రూపొందుతుంది.