లక్ అనేది - లేదు... మన రాత - మనమే రాసుకోవాలి : స్పూర్తి నింపేలా 'గుడ్ లక్ సఖి'
Send us your feedback to audioarticles@vaarta.com
నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు కీర్తిసురేష్.. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ అమ్మడు… నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సావిత్రి బయోపిక్ మహనటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడమే కాకుండా… తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఒక్కసారిగా కీర్తి సురేశ్ కెరీర్ మారిపోయింది. దక్షిణాదిలో కీర్తి సురేష్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆమె సౌత్‌లోని టాప్ హీరోయిన్లలలో ఒకరిగా వెలుగొందుతున్నారు.
తాజాగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గుడ్ లక్ సఖి'. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తుండగా... జగపతి బాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించారు. 'దిల్' రాజు (శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్) సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్ చంద్ర పదిరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శ్రావ్యా వర్మ సహ నిర్మాత. ఈ క్రమంలో గుడ్ లక్ సఖి ట్రైలర్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు.
ట్రైలర్ విషయానికి వస్తే.. దేశం గర్వపడేలా షూటర్స్‌ను తయారు చేయాలని భావించిన ఓ కోచ్‌కు అమ్మాయి సఖిని (కీర్తి సురేశ్) ఓ కుర్రాడు పరిచయం చేస్తాడు. గ్రామస్తులంతా ఆ అమ్మాయిని అందరూ 'బ్యాడ్ లక్ సఖి' అంటారు. రైఫిల్ షూటింగ్‌లో ఏమాత్రం అనుభవం లేని ఆ అమ్మాయి కోచ్ దగ్గరకు వెళ్లినప్పుడు లక్ష్యం మీద కాలుస్తుంది. శిక్షణ తీసుకుని పోటీలకు వెళ్లినప్పుడు మాత్రం ఆమె టార్గెట్ మిస్ అవుతుంది. దీంతో నిరాశలో కూరుకుపోయిన సఖి.. మళ్లీ విజేతగా ఎలా నిలిచింది? అనేది మిగిలిన కథగా తెలుస్తోంది. ఈ నెల 28న థియేటర్లలో 'గుడ్ లక్ సఖి' విడుదల కానుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments