రజనీకాంత్‌తో కీర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
'2.0' తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ 'పేట్ట' తమిళంలో సంక్రాంతికి.. తెలుగులో జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి 1న విడుదలవుతున్నాయి. కాగా రజనీకాంత్, ఎ.ఆర్.మురగదాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందనే వార్తలు చాలా రోజులుగా కోలీవుడ్‌లో వినపడుతుంది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందట.
త్వరలోనే రజనీకాంత్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈయన పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తే దానికి వచ్చే క్రేజే వేరుగా ఉంటుంది. ఇది వరకు ఓ ప్రెస్‌మీట్‌లో రజనీకాంత్‌తో సినిమా చేస్తే అందులో ఫిక్షన్ కూడా ఉంటుందని మురగదాస్ తెలియజేసిన సంగతి తెలిసిందే.
'నార్కాలి' అనే టైటిల్ కూడా వినపడుతున్న నేపథ్యంలో ఈ చిత్రంలో కీర్తిసురేశ్ నటించనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com