కీర్తి సురేష్.. అతనితో మరోసారి
Send us your feedback to audioarticles@vaarta.com
'మెర్సల్' (అదిరింది) సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు తమిళ కథానాయకుడు విజయ్. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని.. తనకి ఆల్రెడీ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఇచ్చిన ఎ.ఆర్.మురుగదాస్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 20వ తేదీనుంచి సినిమా షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.
ఈ సినిమాలో విజయ్ 35సంవత్సరాల నడి వయస్కుడిగా కనిపించబోతున్నాడు. అలాగే ప్రతినాయకుడి పాత్రను కూడా పోషించనున్నట్లు తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. అయితే ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడా లేకపోతే ఒకే పాత్రలో రెండు షేడ్స్ ని దర్శకుడు చూపించబోతున్నాడా అనే విషయాన్ని గోప్యంగా ఉంచబోతున్నారని సమాచారం.
ఈ హాట్రిక్ వెంచర్ కి హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉంది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'భైరవ' సినిమాలో విజయ్, కీర్తి కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. కాగా, వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమాని విడుదల చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com