కీర్తి సురేష్‌.. అత‌నితో మ‌రోసారి

  • IndiaGlitz, [Friday,December 01 2017]

'మెర్సల్' (అదిరింది) సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు త‌మిళ క‌థానాయ‌కుడు విజయ్. ప్ర‌స్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని.. త‌న‌కి ఆల్రెడీ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఇచ్చిన ఎ.ఆర్.మురుగదాస్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 20వ తేదీనుంచి సినిమా షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

ఈ సినిమాలో విజయ్ 35సంవత్సరాల నడి వయస్కుడిగా కనిపించబోతున్నాడు. అలాగే ప్రతినాయకుడి పాత్రను కూడా పోషించనున్నట్లు తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. అయితే ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడా లేకపోతే ఒకే పాత్రలో రెండు షేడ్స్ ని దర్శకుడు చూపించబోతున్నాడా అనే విషయాన్ని గోప్యంగా ఉంచబోతున్నారని సమాచారం.

ఈ హాట్రిక్ వెంచర్ కి హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉంది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'భైరవ' సినిమాలో విజ‌య్‌, కీర్తి కలిసి నటించిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. కాగా, వచ్చే ఏడాది దీపావ‌ళికి ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్నారు.