చైనీస్ నటుడితో కీర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రం.. 16వ శతాబ్దానికి చెందిన కుంజలి మరక్కర్ IVగా పేరుగాంచిన మహమ్మద్ అలీ జీవిత కథగా తెరకెక్కుతోంది. 'మరక్కర్: ది లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ' అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, పరేష్ రావల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు.
16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారిపై కుంజలి మరక్కర్ సైన్యం.. నీటి మీద సాగే యుద్ధ నౌకలతో తిరుగుబాటు చేసేవారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ఆ సన్నివేశాలను కళ్ళకి కట్టినట్టు చూపించనున్నారు దర్శకులు. అందుకోసం.. పోర్చుగీస్ వారి పాత్రల్లో కొంతమంది బ్రిటిష్ నటులను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
టాలీవుడ్ నుండి నాగార్జున ఈ చిత్రంలో నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కూడా నటించనుందట. అది కూడా ఓ చైనీస్ నటుడు సరసన. దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందట. నవంబర్‌లో ఈ సినిమా రామోజీ ఫిలింసిటీలో ప్రారంభం అవుతుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments