అనిరుథ్‌తో కీర్తి సురేష్ పెళ్లంట!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవలి కాలంలో హీరోయిన్ కీర్తి సురేష్ గురించి కామన్‌గానే పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే తొలుత కీర్తి సురేష్ పెళ్లి విషయంలో రూమర్స్ రాగా.. ఇప్పుడు ఓ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌తో కీర్తి సురేష్ డేటింగ్‌లో ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఓ ప్రముఖ బీజేపీ నాయకుడి కుమారుడితో కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఆమె పెళ్లి ఒప్పందం చేసుకున్నారంటూ రూమర్స్ బాగా వినిపించాయి. కానీ ఆమె కుటుంబ సభ్యులు దీనిని ఖండించారు.
తాజాగా కీర్తి సురేష్ గురించి మరో వార్త బాగా ట్రెండింగ్‌లో ఉంది. కీర్తి సురేష్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో డేటింగ్‌లో ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే వారిద్దరూ తమ బంధాన్ని పెళ్లి ద్వారా ధృడపరుచుకోవాలని భావిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
అనిరుధ్ రవిచందర్.. దక్షిణ భారతదేశంలో అత్యధిక సంఖ్యలో అభిమానులున్నారు. అంతే కాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్‌కు అనిరుథ్ దగ్గరి బంధువు. అనిరుథ్‌కి కామన్ ఫ్రెండ్స్ ద్వారా కీర్తి సురేష్ పరిచయమైనట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరి రిలేషన్‌షిప్ మాత్రం ఇప్పటి వరకూ బయటకు రాకపోవడం విశేషం. ప్రస్తుతం కీర్తి సురేష్.. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోంది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై మాత్రం ఇప్పటి వరకూ వీరిద్దరూ స్పందించలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com