నిర్మాతగా మారుతున్న కీర్తి..?
Send us your feedback to audioarticles@vaarta.com
కీర్తి సురేశ్... ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సొంతం చేసుకుని ఒక పక్క స్టార్ హీరోల సినిమాలతో పాటు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలను ఒప్పుకుంటూ తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్నారు. మహానటితో జాతీయ అవార్డును సంపాదించుకుని ఓ మెట్టు పైకి ఎక్కిన కీర్తి వరుస సినిమాలకు ఓకే చెబుతూ స్పీడుమీదున్నారు. అయితే లేటెస్ట్ ట్రెండ్‌ను కీర్తి పక్కాగా ఫాలో అవుతున్నట్లు అర్థమవుతుంది. ఎందుకంటే.. త్వరలోనే కీర్తిసురేశ్ నిర్మాతగా అవతారం ఎత్తనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వివరాల్లోకెళ్తే.. ఇప్పటి వరకు సినిమాలకే పరిమితమైన కీర్తిసురేశ్ త్వరలోనే డిజిటల్ మాధ్యమంలోకి అడుగుపెడుతున్నారు. అయితే నటిగా మాత్రం కాదండోయ్. నిర్మాతగా అని టాక్ వినిపిస్తోంది. కీర్తిసురేశ్ ప్రొడక్షన్లో ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నటిగా కీర్తి కిట్టీలో ‘గుడ్ లక్ సఖితో పాటు మిస్ ఇండియా విడుదల కావాల్సి ఉండగా నితిన్‌తో రంగ్ దే, సర్కారువారి పాట’, ఓ మలయాళం చిత్రం చిత్రీకరణ దశలో ఉన్నాయి. పెంగ్విన్ తర్వాత విడుదల కానున్న మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి చిత్రాలు ఓటీటీ బాటపట్టనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com