నానికి జోడీగా కీర్తిసురేష్?
Send us your feedback to audioarticles@vaarta.com
'నేను లోకల్' లో జంటగా నటించి ఆకట్టుకున్నారు నేచురల్ స్టార్ నాని, కేరళకుట్టి కీర్తి సురేష్. త్వరలోనే ఈ జోడీ మరోసారి సందడి చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. మళ్ళీ రావా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో నాని ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా తొలుత శ్రుతి హాసన్ పేరు వినిపించింది.
అయితే.. ఈ అవకాశం కీర్తి సురేష్‌కు దక్కిందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి.. ఈ కథనాల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా కనిపించనున్నారు. 36 ఏళ్ళ వయసులో.. తనలో దాగిఉన్న ప్రతిభను గుర్తించిన కథానాయకుడు.. క్రికెటర్‌గా ఏం సాధించాడు? అనేదే ఈ సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com