కీర్తిసురేష్ ను చూసి భయపడుతున్నారా..

  • IndiaGlitz, [Saturday,June 03 2017]

ప‌వ‌న్‌కల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు త‌ర్వాత వ‌స్తోన చిత్ర‌మిది. సినిమాను ద‌స‌రా బ‌రిలోకి దింప‌డానికి నిర్మాత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈసారి త‌మ అభిమాన క‌థానాయ‌కుడిని త్రివిక్ర‌మ్ ఎలా చూపిస్తాడోన‌ని అభిమానులు చాలా అతృత‌గా వెయిట్ చేస్తున్నారు. ఈసినిమాలో కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.
తెలుగులో కీర్తి సురేష్‌, ఈ చిత్రంతో పాటు మ‌హాన‌టి చిత్రంలో సావిత్రి పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ పాత్ర కోసం కీర్తి కాస్తా బొద్దుగా క‌న‌ప‌డాల్సి ఉంది. మ‌రిప్పుడు కీర్తి వెయిట్ పెరిగితే ఆ ఎఫెక్ట్ ప‌వ‌న్ సినిమాపై ప‌డుతుందని కొంద‌రు అనుకుంటున్నారు. అయితే మ‌రికొంద‌రు మాత్రం అలాంటిదేం ఉండ‌ద‌ని, అస‌లు రెండు లుక్స్‌కు చాలా వేరియేష‌న్స్ ఉండటం వ‌ల్ల ఎక్క‌డా తేడా కొట్ట‌ద‌ని అనుకుంటున్నారు. అస‌లు కీర్తిసురేష్ లుక్‌పై అంద‌రికీ అనుమానం రావ‌డానికి కార‌ణం ప‌వ‌న్ కాట‌మ‌రాయుడు చిత్ర‌మే. ఎందుకంటే ఈ చిత్రంలో శృతిహాస‌న్ కాస్తా బొద్దుగా క‌న‌ప‌డ‌టంతో పాటు, ఆమె మేక‌ప్‌, కాస్ట్యూమ్స్ విష‌యంలో కేర్ తీసుకోక‌పోవ‌డంతో సినిమా నెగ‌టివ్ శృతి కూడా చేరింది. ఇప్పుడూ అలా ఏమైనా జ‌రుగుతుందేమోన‌ని అనుకుంటున్నారు.

More News

వర్మ ట్విట్టర్ ను వదలిపోవడానికి నాగబాబే కారణమా?

ఎప్పుడూ తనదైన కామెంట్స్ తో,రాతలతో ఇతరులను టార్గెట్ చేసేవాళ్ళలో రాంగోపాల్ వర్మ ముందుంటారు.

జూలై 7న నేచురల్ స్టార్ నాని, దానయ్య డి.వి.వి.ల 'నిన్ను కోరి'

ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్మేన్, మజ్ను, నేను లోకల్ వంటి వరస హిట్స్తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకొని 'నిన్నుకోరి' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆ టైమింగ్ క్యాచ్ చేయగలనో లేదో అని భయపడ్డాను - అడివి శేష్

నటించిన అతికొద్ది చిత్రాలతోనే నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న నటుడు అడివి శేష్. త్వరలో అనంత్ గా "అమీ తుమీ"తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూన్ 9న విడుదలకానున్న "అమీ తుమీ" గురించి అడివి శేష్ చెప్పిన విశేషాలు..

నటుడు -దర్శకుడు పొలిచెర్ల హరనాథ్ కి పితృవియోగం

ప్రముఖ న్యూరాలజిస్టు దర్శక -నిర్మాత -నటుడు డాక్టర్ హరినాథ్ పొలిచెర్ల తండ్రి వెంకట సుబ్బయ్య జూన్ 1 న తిరుపతి లో తుది శ్వాస విడిచారు .చీఫ్ ఇంజినీరుగా పనిచేసిన ఆయన స్ఫూర్తితోనే హరనాథ్ సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'మా ఊరి ప్రేమకథ'

మంజునాథ్ హీరోగా 'శరణం గచ్ఛామి' ఫేమ్ తనిష్క తివారి హీరోయిన్గా శ్రీమల్లికార్జున స్వామి క్రియేషన్స్ పతాకంపై ఎస్.వి.ఎమ్. దర్శకత్వంలో రూపొందుతున్న గ్రామీణ ప్రేమకథా చిత్రం 'మా ఊరి ప్రేమకథ'.