రెమ్యునరేషన్స్ విషయంలో కీర్తి ఆలోచన
- IndiaGlitz, [Tuesday,June 16 2020]
కరోనా ప్రభావంతో చాలా రంగాలు నష్టపోయాయి. అలా నష్టపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ కూడా ఉంది. మరో వైపు సినిమా థియేటర్స్ విషయంలో క్లారిటీ రాకపోవడంతో చిన్న నిర్మాతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. సినిమాలను ఎప్పుడు విడుదల చేసుకోవాలనుకోవడంపై ఓ క్లారిటీ లేదు. దీంతో చిన్న నిర్మాతలు సినిమాలను డిజిటల్ మీడియాల్లో విడుదల చేసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే హీరో సూర్య సహా మరి కొంతమంది తాము నిర్మించిన సినిమాలను ఓటీటీల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే కీర్తిసురేశ్ సినిమా పెంగ్విన్ ఓటీటీలో విడుదలవుతుంది. అలాగే మరో సినిమా మిస్ ఇండియా కూడా ఓటీటీలోనే విడుదలయ్యే అవకాశం కనపడుతుంది. కరోనా ప్రభావం మామూలుగా లేదు. ఎంతలా అంటే అసలు కరోనా ఎఫెక్ట్‌తో సినిమా థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. సినిమా షూటింగ్‌లకు పర్మిషన్స్ వచ్చాయి. కానీ షూటింగ్స్ స్టార్ట్ చేయాలంటే దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో కీర్తిసురేశ్ రెండు, మూడు నెలల వరకు సినిమా షూటింగ్స్‌కు దూరంగా ఉండాలనుకుంటుందట. అంతే కాకుండా తాను చేస్తున్న సినిమాలకు రెమ్యునరేషన్స్ 25-30 శాతం తగ్గించుకునే ఆలోచనలోనూ ఉందని వార్తలు వినపడుతున్నాయి.