విజయ్ సరసన కీర్తి సురేష్...

  • IndiaGlitz, [Tuesday,February 16 2016]

తెలుగులో ఈ ఏడాది నేను..శైల‌జ' చిత్రంతో స‌క్సెస్ అందుకున్న కీర్తి సురేష్‌, ఇప్పుడు త‌మిళంలో ర‌జ‌నీ మురుగ‌న్' చిత్రంలో న‌టించి మెప్పించింది. ఇప్పుడు ఈమెకు స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాలు వ‌స్తున్నాయి. త‌మిళంలో ఏకంగా స్టార్ హీరో విజ‌య్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. భ‌ర‌త‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ త‌న 60వ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌లోకి వెళుతుంది. ఈ సినిమాలో ముందు కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు కానీ ఇప్పుడు కీర్తి సురేష్ ఓకే అయ్యింది. ఇప్పుడు ఈ విష‌యాన్ని కీర్తి సురేష్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేసింది.