పవన్ చిత్రంలో..కీర్తి సురేష్ లుక్ అదుర్స్
Send us your feedback to audioarticles@vaarta.com
జల్సా, అత్తారింటికి దారేది తరువాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పవన్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. కుష్బూ, బొమన్ ఇరాని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకి అజ్ఞాత వాసి అనే పేరు వినిపిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఇవాళ కీర్తి సురేష్ పుట్టినరోజు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఆమె లుక్‌ని విడుదల చేసింది. ట్రెడీషనల్ లుక్‌లో కీర్తి జస్ట్ అదుర్స్ అనే చెప్పాలి. కాగా, కీర్తి బర్త్‌డే సందర్భంగా మహానటి చిత్ర యూనిట్ కూడా ఆమె ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది. ఆకాశవీధిలో అందాల జాబిలి పేరుతో ఆమె కన్నులు మాత్రమే కనిపించేలా విడుదల చేసిన ఈ లుక్‌లో నిజంగా సావిత్రి లాగే ఉంది కీర్తి. ఈ లుక్‌కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com