ఆసక్తికరమైన పాత్రలో కీర్తి..?
Send us your feedback to audioarticles@vaarta.com
‘మహానటి’తో జాతీయ అవార్డు దక్కించుకున్న కీర్తిసురేశ్ ఒక పక్క మహిళా ప్రధానమైన చిత్రాలతో పాటు, స్టార్ హీరో సినిమాల్లో నటిస్తూ మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్గా ఈమె నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ పెంగ్విన్ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మిస్ ఇండియా’ కూడా విడుదలకు సిద్ధమవుతుంది. అలాగే కీర్తి రజినీకాంత్ అణ్ణాత్తే చిత్రంతో పాటు తెలుగులో సూపర్‌స్టార్ మహేశ్ 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ చిత్రంలోనూ హీరోయిన్గా నటిస్తున్నారు.
తాజా సమాచారం మేరకు మహేశ్ ‘సర్కారు వారి పాట’ చిత్రంలో బ్యాంకు ఉద్యోగి పాత్రలో కనిపించనున్నారు. కార్పొరేట్ బ్యాంకు ఉద్యోగి పాత్రలో కీర్తి కనపడతారనే దాంట్లో నిజా నిజాలు తెలియాలంటే వేచి చూడాలి. బ్యాంకులను మోసం చేసిన విలన్ నుండి తిరిగి డబ్బులు రాబట్టే కథే ఈ సినిమా అని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్ ప్లస్ బ్యానర్స్‌పై సినిమా నిర్మితమవుతోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com