ఆర్ఆర్ఆర్ మల్టీస్టార‌ర్‌లో కీర్తి

  • IndiaGlitz, [Tuesday,May 15 2018]

బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ పాత్రల గురించి చాలా ర‌కాలైన వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతుంది. రీసెంట్‌గా విడుద‌లైన 'మ‌హాన‌టి' చిత్రంలో సావిత్రి పాత్ర‌ధారిగా కీర్తిసురేశ్ మంచి అభిన‌యంతో ఆకట్టుకుంది.

కీర్తికి ఇప్పుడు తెలుగు, త‌మిళంలో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యంది. ఈ క్రేజ్‌తో పాటు కీర్తి న‌ట‌న ప‌రంగా రాజ‌మౌళిని ఆక‌ట్టుకుంది. దాంతో కీర్తిని న‌టింప చేయాల‌ని రాజ‌మౌళి అండ్ టీం భావిస్తుంద‌ట‌.