మ‌హేశ్ 27లో మ‌హాన‌టి..?

  • IndiaGlitz, [Thursday,March 26 2020]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా, మ‌హేశ్‌కి క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆగిపోయింది. వంశీ పైడిప‌ల్లి స్థానంలో ప‌రుశురామ్ చేరాడు. క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. కాబ‌ట్టి ప‌రుశురామ్‌కు కావాల్సినంత టైమ్ దొరికింది. స్క్రిప్ట్‌ను మరింతగా మెరుగులు దిద్దే ప‌నిలో ప‌డ్డాడీ ద‌ర్శ‌కుడు. సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 31న సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసి జూలైలో రెగ్యుల‌ర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ను న‌టింప చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గి.. లాక్ డౌన్ ఎత్తి వేయ‌గానే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ అవుతాయ‌ట‌.

అలాగే ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది స‌మ‌ర్మ్‌లో ఏప్రిల్ 28న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ని టాక్‌. ఇదే రోజున 14 ఏళ్ల క్రితం అంటే 2006లో మ‌హేశ్ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచి, మ‌హేశ్‌ని సూప‌ర్‌స్టార్‌గా నిల‌బెట్టిన పోకిరి చిత్రం విడుద‌లైంది. అదే రోజున త‌న 27వ సినిమాను మ‌హేశ్ విడుద‌ల చేయాల‌నుకుంటున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.