చిరంజీవి సినిమాలో కీర్తి సురేష్.. ఏ పాత్రలోనంటే ?

మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ మూవీలో హీరోయిన్ కీర్తి సురేష్ ఛాన్స్ కొట్టేసింది. చిరు హీరోగా తమిళ్ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ను డైరెక్టర్ మెహర్ రమేష్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం డైరెక్టర్ మెహర్ రమేష్ నటీనటుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాలో సోదరి పాత్ర అత్యంత కీలకం కానుంది. దీని కోసం మెహర్ రమేష్ కీర్తి సురేష్‌ను ఎంచుకున్నట్టు సమాచారం.

మంచి నటనకు స్కోప్‌తో పాటు చిత్రానికి కీలక పాత్ర కావడంతో చిత్రబృందం కీర్తిని ఈ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు.. ఈ పాత్ర కోసం కీర్తి పేరును స్వయంగా మెగాస్టారే ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కీర్తి కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలోనే అగ్రిమెంట్‌పై కీర్తి సైన్ చేయనున్నట్టు తెలుస్తోంది. ‘మహానటి’ తర్వాత కీర్తికి తెలుగులో ఆఫర్స్ బాగా తగ్గిపోయాయి.

ఇప్పుడిప్పుడే తిరిగి బిజీ అవుతోంది. ‘సర్కారు వారి పాట’లో సూపర్ స్టార్ మహేష్‌బాబు సరసన కీర్తి నటిస్తోంది. కాగా ‘వేదాళం’ రీమేక్‌కు అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనున్నట్టు తెలుస్తోంది.

More News

‘పుష్ప’ షెడ్యూల్ ప్లానింగ్‌లో చిన్న మార్పు

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.

కృష్ణ-విజయనిర్మల కుటుంబ సభ్యుడు శరణ్ హీరోగా, రామచంద్ర వట్టికూటి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ప్రారంభమైంది

పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ - అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విజయనిర్మల కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నారు.

ఓ చిన్నారి కోసం ట్రైన్ ఏకంగా 240 కి.మీ ఆగకుండా ప్రయాణించింది..

కొన్నిసార్లు ప్రజల రక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగం చేసే పనులు చాలా ఆసక్తికరంగానూ.. చరిత్రలో నిలిచిపోయేవిగానూ ఉంటాయి.

దర్శకధీరుడికి పొలిటికల్‌ హీట్‌

వివాదాలకు దూరంగా ఉండే దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు పొలిటికల్‌ సెగ తగిలింది. ఈ సమస్యకు కారణం ఆయన దర్శకత్వంలో

దేశంలో 3 నెలల కనిష్టానికి కరోనా కేసులు..

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు దాదాపు 80 లక్షలకు చేరువయ్యాయి.