బాలయ్య పక్కన కీర్తీ!
- IndiaGlitz, [Saturday,December 07 2019]
తొలి సినిమా నేనూ శైలజ, ఆ తర్వాత మహానటి.... ఇప్పుడు చేతిలో మరికొన్ని సినిమాలు ఫుల్ స్వింగ్ మీదుంది కీర్తి పేరు. చేసిన ప్రతి సినిమా హిట్ కాకపోయినా, కీర్తీ సురేష్ అప్పుడప్పుడూ ఒక సినిమా హిట్ అవుతూనే ఉంది. సో ఇప్పుడు ఈ లక్కీ గర్ల్ ని మరో అవకాశం వరించింది. సీనియర్ హీరోలతో ఎలాంటి షరతులు లేకుండా యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటున్న కీర్తీ లేటెస్ట్ గా బాలయ్యతో ఓ సినిమాకు సంతకం చేసిందని ఫిల్మ్ నగర్ టాక్.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ముహూర్తం డిసెంబర్ 6న జరిగింది. గతంలో సింహా, లెజెండ్ సినిమాలు చేసిన బోయపాటి ముచ్చటగా మూడోసారి బాలయ్యను డైరక్ట్ చేస్తున్నారు. 'మా ఇద్దరి ఆలోచనలూ ఒకే రకంగా ఉంటాయి. మేం గతాన్ని తవ్వం. ముందుచూపుతో ముందుకెళ్తుంటాం' అని బాలయ్య స్వయంగా బోయపాటి గురించి కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతేకాదు డివోషనల్ టచ్ ఉన్న సబ్జెక్ట్ అని కూడా హింట్ ఇచ్చారు.
సో ఈ మూవీలో బాలయ్య పెయిర్‌గా కీర్తీ డివోషనల్‌గా కనిపిస్తుందా? లేకుంటే హాట్‌గా స్టెప్పులేస్తుందా? అనేది వెయిట్ చేసి చూడాలి. బాలయ్యకు, కీర్తీకి మరో పోలిక ఏంటంటే ఇద్దరూ గతంలో ఉన్నదానికన్నా బాగా తగ్గారు. బాలయ్య లేటెస్ట్ గా పది కిలోలు తగ్గితే, కీర్తీ కూడా మిస్ ఇండియా కోసం పది కిలోలకు పైగానే తగ్గింది. ఇద్దరూ స్లిమ్ ఫిట్‌లో బోయపాటి మూవీలో సందడి చేస్తారన్నమా.