త్రిభాషా చిత్రంలో కీర్తి సురేష్
Send us your feedback to audioarticles@vaarta.com
మహానటితో తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ఓ త్రిభాషా చిత్రంలో నటించనుంది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో పాటు ఓ ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది.
ఆసక్తికరమైన విషయమేమేంటే ఇదొక మహిళా ప్రధానమైన చిత్రం.. దీన్ని జాతీయ అవార్డు గ్రహీత నాగేష్ కుకునూర్ డైరెక్ట్ చేయబోతున్నారు. రీసెంట్‌గా ఫోటో షూట్ కూడా పూర్తయ్యింది.
ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుది దశలో ఉన్నాయి. ఈ ఏడాది రజనీకాంత్‌తో పాటు, ఓ బాలీవుడ్ సినిమాలో కీర్తి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments