నాలుగు డిఫరెంట్ లుక్స్ లో కీర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది నటీనటులు వచ్చి పోతుంటారు. కానీ కొందరు తమదైన నటనతో చెరగని ముద్ర వేస్తుంటారు. అలాంటి వారిలో కీర్తి సురేశ్ ఒకరు. అందుకే వచ్చిన అతి కొద్ది సమయంలో నటిగా గుర్తింపు సంపాదించుకోవడమే కాదు.. `మహానటి`తో ఉత్తమనటిగా అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. అవార్డు గుర్తింపు తేవడంతో పాటు బాధ్యతను కూడా మరింత పెంచిందని కీర్తిసురేష్ భావించిందేమో! కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తుంది కీర్తి సురేష్. ఇప్పుడు ఆమె చేతిలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చాలానే ఉన్నాయి. అలాగే బాలీవుడ్ సినిమాలతోనూ కీర్తి ఫుల్ బిజీగా మారిపోయింది.
తాజాగా ఈమె నటిస్తున్న చిత్రాల్లో `మిస్ ఇండియా` ఒకటి. ఈ సినిమా కోసం కీర్తి పడ్డ కష్టం చూస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాకు ముందు చబ్బీగా ఉండే కీర్తిసురేష్ బరువు బాగా తగ్గిపోయింది. ఎంతలా అంటే.. చిన్నపిల్లలా కనిపించేంతలా. ఈ సినిమాలో నాలుగు డిఫరెంట్ లుక్స్ ఉన్నాయట. ఏదో మేకప్ వేసుకుని నటించాలని కాకుండా.. పాత్ర కోసం ప్యాషన్‌గా వర్క్ చేస్తుందట. ఈ నాలుగు లుక్స్ కోసం కీర్తి సురేష్ దాదాపు 50 లుక్ టెస్ట్‌లు చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నరేంద్ర నాథ్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout