కీర్తి సురేష్.. పేరు ఉండదట
Send us your feedback to audioarticles@vaarta.com
అనతికాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కేరళకుట్టి కీర్తి సురేష్. నేను శైలజ, నేను లోకల్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది అజ్ఞాతవాసి, మహానటి చిత్రాలతో సందడి చేయనుంది. వీటిలో అజ్ఞాతవాసి ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ బిజీగా ఉన్న కీర్తి.. ఇదే సంక్రాంతికి ఓ తమిళ అనువాద చిత్రంతో సందడి చేయనుంది. ఆ సినిమానే గ్యాంగ్. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు.
ఇందులో కీర్తి ఓ బ్రాహ్మణ యువతిగా కనిపించనుందని తెలిసింది. అంతేకాకుండా.. ఫన్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో సాగే ఈ పాత్రకి సినిమా మొత్తంగా పేరనేది వినిపించకుండా సాగుతుందట. తమిళంలో తాన సేరంద కూటమ్ పేరుతో రూపొందిన ఈ సినిమా ఈ నెల 12న.. రెండు భాషల్లోనూ ఒకే సారి విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments