కీర్తి సురేష్‌.. పేరు ఉండ‌ద‌ట‌

  • IndiaGlitz, [Monday,January 01 2018]

అన‌తికాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్‌. నేను శైల‌జ‌, నేను లోక‌ల్ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది అజ్ఞాత‌వాసి, మ‌హాన‌టి చిత్రాల‌తో సంద‌డి చేయ‌నుంది. వీటిలో అజ్ఞాత‌వాసి ముందుగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు త‌మిళంలోనూ బిజీగా ఉన్న కీర్తి.. ఇదే సంక్రాంతికి ఓ త‌మిళ అనువాద చిత్రంతో సంద‌డి చేయ‌నుంది. ఆ సినిమానే గ్యాంగ్‌. సూర్య హీరోగా న‌టించిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఇందులో కీర్తి ఓ బ్రాహ్మ‌ణ యువ‌తిగా క‌నిపించ‌నుందని తెలిసింది. అంతేకాకుండా.. ఫ‌న్‌, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో సాగే ఈ పాత్ర‌కి సినిమా మొత్తంగా పేర‌నేది వినిపించ‌కుండా సాగుతుంద‌ట‌. త‌మిళంలో తాన సేరంద కూట‌మ్ పేరుతో రూపొందిన ఈ సినిమా ఈ నెల 12న‌.. రెండు భాష‌ల్లోనూ ఒకే సారి విడుద‌ల కానుంది.

More News

శ్రీధర్ సీపాన 'బృందావనమది అందరిది' ప్రధాన తారాగణం వీరే

జస్ట్ ఎంటరర్ టైన్ మెంట్ క్రియేషన్స్ పతాకం పై  ప్రముఖ తేజ డైమండ్స్ సికింద్రాబాద్ అధినేత శ్రీనివాస్ వంగల మరియు  ప్రభాకర్ రెడ్డి కూతురు (యన్. అర్. ఐ ) నిర్మాతలుగా సక్సెస్ ఫుల్ రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'బృందావనమది అందరిది'.

ఇద్ద‌రు బిడ్డ‌ల త‌ల్లిగా కాజ‌ల్‌?

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. గ్లామ‌ర్ పాత్ర‌లకే ప‌రిమితం కాకుండా పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌ల్లోనూ ఆక‌ట్టుకున్న క‌థానాయిక పేరిది. ద‌క్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా రాణించిన కాజ‌ల్‌.. హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించింది.

అక్క‌డా దేవిశ్రీ ప్ర‌సాద్‌నే హ‌వా

దేవిశ్రీ ప్ర‌సాద్‌.. తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఓ సంచ‌ల‌నం. ప్ర‌స్తుతం నెంబ‌ర్‌వ‌న్ క‌థానాయ‌కుడిగా దూసుకుపోతున్న ఈ యువ సంగీత సంచ‌ల‌నం.. తెలుగులో ఈ ఏడాది చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లోనే సినిమాలు చేశాడు.

37 రోజులు.. 10 ఫస్ట్ లుక్స్

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యువ కథానాయకుడు నేచురల్ స్టార్ నాని.

'సుస్వాగతం' కి 20 ఏళ్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో.