కీర్తి సురేష్, ఆది పినిశెట్టిల ‘గుడ్ లక్ సఖి’ టీజర్ విడుదల

  • IndiaGlitz, [Saturday,August 15 2020]

కీర్తి సురేష్, ఆది పినిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం.. ‘గుడ్ లక్ సఖి’. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ నేడు విడుదల అయింది. దిల్ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి, శ్రవ్యా వర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ తెలుగులో నటిస్తోంది. మూడు భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

జగపతి బాబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కీర్తి ఓ గిరిజన యువతిగా నటిస్తోంది. ఒక గిరిజన యువతి షూటింగ్‌లో ఎలా రాణించింది.. దేశానికి ఎలా గర్వకారణంగా మారింది.. అనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. కీర్తి సురేష్‌ని పెళ్లి కూతురిగా గెటప్‌లో చూపిస్తూ ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఈ పెళ్లి జరగకపోవడం.. కీర్తికి బ్యాడ్ లక్ సఖిగా ఉన్న పేరు మరింత స్థిరపడటం వంటి అంశాలతో టీజర్‌ను వదిలారు.

ఈ సినిమాలో ఆది పినిశెట్టి ఓ స్టేజి ఆర్టిస్టుగా నటించారు. కీర్తి, ఆది పినిశెట్టిల మధ్య కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. జీవితంలో రాణించాలంటే లక్ అవసరం లేదు.. కృషి, పట్టుదల ఉంటే చాలు.. మన రాతను మనమే రాసుకోవచ్చనేదే కథాంశంగా టీజర్‌ని బట్టి తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళంలో తెరకెక్కుతోంది. ఈ టీజర్ రిలీజైన కొన్ని గంటల్లో లక్షల్లో వ్యూస్‌ను సంపాదించుకుంది.

More News

ఏయ్ రెడ్డీస్.. నన్ను రెచ్చగొడితే.. గూబ పగిలిపోద్ది: రఘురామరాజు

తనను ఫోన్‌లో బెదిరిస్తున్న వారిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మువ్వన్నెల జెండా సాక్షిగా రాజధానులపై మాట్లాడిన జగన్

ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడినంతగా సీఎం జగన్ మాత్రం మూడు రాజధానుల విషయమై మాట్లాడరు.

వదంతులను నమ్మకండి.. నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది: ఎస్పీ చరణ్

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరి, కుమారుడు క్లారిటీ ఇచ్చారు.

బాలు.. త్వరగా లేచిరా!  నీ కోసం కాచుకుని కూర్చున్నాను:  ఇళ‌య‌రాజా

గానగంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కోవిడ్ 19 కార‌ణంగా ఆగ‌స్ట్ 5న చెన్నై ఎంజీఎం హాస్పిట‌ల్‌లో జాయిన్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఏపీలో కొత్తగా 8943 కరోనా కేసులు..

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీకి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది.