కీర్తి తెలుగు డబ్బింగ్?
- IndiaGlitz, [Monday,November 27 2017]
చక్కనమ్మా ఏం పలికినా అందమే..అనే రీతిలో ఏ భాష నుండి అయినా తెలుగులోకి వస్తున్న హీరోయిన్స్ అందరూ ఇప్పుడు తెలుగును నేర్చుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. రాశిఖన్నా లాంటివారు తెలుగు భాషను నేర్చుకోవడమే కాదు, ఏకంగా పాటలు కూడా పాడేస్తున్నారు.
ఇప్పుడు వీరి బాటలోకి కీర్తి సురేష్ అడుగుపెట్టింది. ఈ తమిళ హీరోయిన్ ఇప్పుడు తమిళంతో పాటు తెలుగులో కూడా బిజీ హీరోయిన్ అయ్యింది. తెలుగులో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సినిమాతో పాటు, మహానటిలో నటిస్తుంది.
తొలిసారి పవన్‌కల్యాణ్ సినిమాకు సంబంధించి కీర్తి సురేష్ తన స్వంత వాయిస్‌తో డబ్బింగ్ చెప్పుకుంది. ఈ విషయాన్ని కీర్తి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. ఆ ఫోటోను కూడా పోస్ట్ చేసింది.