కీర్తి సురేష్.. డబుల్ ధమాకా
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్న కథానాయికల్లో కీర్తి సురేష్ ఒకరు. తెలుగులో ఇప్పటికే నేను శైలజ, నేను లోకల్ చిత్రాల విజయాలతో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉంది.
అను ఇమ్మానియేల్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదే సంక్రాంతికి కీర్తి హీరోయిన్‌గా మరో సినిమా కూడా రానుంది. అయితే అది తమిళ చిత్రం.
సూర్య హీరోగా నటించిన తానే సేరంద కూట్టమ్ చిత్రం పొంగల్‌కి రాబోతోంది. నయనతార తాజా ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగులోనూ ఈ సినిమా విడుదల కానుంది. మొత్తానికి.. 2018 సంక్రాంతికి కీర్తి సురేష్ డబుల్ ధమాకా ఇవ్వనుందన్నమాట.
అన్నట్టు.. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతున్న మహానటిలోనూ కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments