డబ్బింగ్ ప్రారంభించిన కీర్తి సురేష్
Send us your feedback to audioarticles@vaarta.com
నటీమణి సావిత్రి బయోపిక్‌గా ‘మహానటి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం డబ్బింగ్ పనులను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రసాద్ ల్యాబ్‌లో తాజాగా డబ్బింగ్ పార్టు కూడా స్టార్ట్ అయింది. ఈ సినిమాలో నటించే నటీనటులంతా వారి పాత్రలకి వారే డబ్బింగ్ చెప్పుకోవాలని కండిషన్ పెట్టారట దర్శకుడు నాగ్ అశ్విన్.
ఈ నేపథ్యంలోనే.. సావిత్రి పాత్రధారిణి కీర్తి సురేష్ కూడా తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారని సమాచారం. గతంలో ‘అజ్ఞాతవాసి’ సినిమా కోసం తొలిసారి డబ్బింగ్ చెప్పుకుని పలువురి ప్రశంసలు అందుకున్న కీర్తి.. ఇప్పుడు ‘మహానటి’ చిత్రంతోనూ ప్రశంసలు అందుకుంటారేమో చూడాలి. మోహన్ బాబు, నాగచైతన్య, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, షాలినీ పాండే తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను మే 9న విడుదల చేయడానికి నిర్మాత అశ్వనీదత్ సన్నాహాలు చేసుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com