మరోసారి సావిత్రిగా కీర్తి సురేష్
Send us your feedback to audioarticles@vaarta.com
మహానటుడు స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవితకథను వెండితెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తూ.. నిర్మిస్తున్న ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల లాంచింగ్ కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ అంటే.. ఆయన సినీ, రాజకీయ ప్రస్థానాలకు సంబంధించిన అంశాలు చాలానే ఉంటాయి. కాగా.. ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించి ఎంతోమంది దిగ్గజ నటీనటులు ఆయనతో కలిసి పని చేసారు. వారిలో హీరోలకు సంబంధించి ఏఎన్నార్ ముందు వరుసలో ఉండగా.. కథానాయికల విషయంలో మహానటి సావిత్రి తొలి స్థానంలో ఉంటారనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
అటువంటి సావిత్రి పాత్రలో.. ఇటీవల ‘మహానటి’తో అందరి ప్రశంసలను అందుకున్న కీర్తి సురేష్ నటించే అవకాశాలున్నాయని సమాచారం. ఈ పాత్ర కోసం ఈమెను చిత్ర బృందం సంప్రదించగా.. కీర్తి కూడా మరోసారి ఈ పాత్రలో నటించేందుకు సుముఖంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే.. టాలీవుడ్లోని పలువురు స్టార్ హీరోలు ఈ సినిమాలో నటిస్తున్నట్టు వస్తున్న వార్తలతో పాటు కీర్తి సురేష్ మరోసారి సావిత్రి పాత్రలో దర్శనమివ్వనున్నారనే కథనాలతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుతున్నాయి.
జూలై 5నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments