BiggBoss6: బకరాలైన కంటెస్టెంట్స్... కీర్తి సేవ్, మిడ్‌వీక్ ఎలిమినేట్ అయిన శ్రీసత్య
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 తెలుగులో నాగార్జున (Nagarjuna) చెప్పినట్లుగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. గ్రాండ్ ఫినాలేకు ఒక్క అడుగు దూరంలో శ్రీసత్య ఇంటిని వీడారు. తొలి నుంచి ఆమె పేరు వినిపిస్తుండగా.. చివరికి అదే నిజమైంది. అయితే ఎప్పుడూ ప్రేక్షకులను బకరాలుగా చేసే బిగ్‌బాస్ ఈసారి ఇంటి సభ్యులను బకరాలను చేశాడు.
ప్రేక్షకులను ఓట్లు అడిగే ఛాన్స్ ఇస్తూ వస్తోన్న బిగ్‌బాస్ నిన్న శ్రీసత్య (Sri Satya), రోహిత్‌లకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ రోజు వాల్ ఆఫ్ ఫార్చూన్ టాస్క్‌లో నెగ్గిన శ్రీహాన్‌కు ఓట్ల కోసం అప్పీల్ చేసుకునే అవకాశం దక్కింది. తన మాటలు, ప్రవర్తన వల్ల కొంతమంది బాధపడ్డారని.. ఇది తాను తెలియక చేసినదేనని శ్రీహాన్ (Shrihan) చెప్పాడు. వీటిని క్షమించి తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ.. దేశాన్ని కాపాడుతున్న జవాన్లకి, అన్నం పెట్టే రైతన్నలకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు.
తర్వాత హెడ్ బాల్ టాస్క్‌లో గెలిచిన కీర్తికి (Keerthi)ఓట్లని అడిగే ఛాన్స్ దక్కింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... తాను బిగ్‌బాస్ హౌస్‌లో ఎలా వుంటానో, బయట కూడా అలానే వుంటానని చెప్పింది. టైటిల్ విన్నర్ అయితే వచ్చే ప్రైజ్‌మనీని తన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోనని, ఓ మంచి పనీ కోసం వాడుతానని చెప్పింది.
టాస్క్‌లన్నీ ముగిసి అంతా పడుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో కంటెస్టెంట్స్‌ని నిద్రలేపాడు బిగ్‌బాస్ (BiggBoss). అందరినీ గార్డెన్ ఏరియాకు రప్పించి మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతోందని, ఇంటి సభ్యులంతా తమ తమ బ్యాగులు సర్దుకుని రెడీగా వుండాలని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. అనంతరం టాప్ 5లో వుండటానికి ఎవరు అనర్హులో చెప్పాలని ఛాలెంజ్ విసురుతాడు. దీనికి రోహిత్, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి, శ్రీసత్యలు అభిప్రాయం చెబుతారు. ఈ సందర్భంగా రోహిత్, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీసత్యలు కీర్తి పేరు చెప్పడంతో ఆమె ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకుంటారు. హౌస్‌మేట్స్ ఏకాభిప్రాయంతో కీర్తికి ఓటేయడంతో ఆమె కూడా మానసికంగా ఎలిమినేట్ అయ్యేది తనేనని డిసైడ్ అయిపోయారు .
ఆ వెంటనే ఇక్కడ ట్విస్ట్ పెట్టారు బిగ్‌బాస్. ఇంటి సభ్యులు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకే ఇలా చేశామని.. ప్రేక్షకుల నిర్ణయమే ఫైనల్ అని చెప్పాడు. మీరంతా కీర్తి ఇంటి నుంచి వెళ్లిపోవాలని కోరుకున్నారు.. కానీ ప్రేక్షకులు మాత్రం శ్రీసత్య హౌస్‌ను వీడాలని కోరుకున్నారని చెప్పాడు. ఆ మాటతో రేవంత్, శ్రీహాన్‌లు ఎమోషనల్ అయ్యారు. తన కోపాన్ని అర్ధం చేసుకున్న తొలి అమ్మాయి అంటూ రేవంత్ ఆమెను హగ్ చేసుకున్నాడు. శ్రీహాన్ కూడా... బాగా హర్ట్ అయ్యాడు. తొలి వారం నుంచి తాము ముగ్గురం కలిసే వుంటున్నామంటూ రేవంత్, శ్రీహాన్, శ్రీసత్యలు హగ్ చేసుకుని కంటతడి పెట్టారు. అలా గ్రాండ్ ఫైనల్‌కు రెండు రోజుల ముందు శ్రీసత్య ఎలిమినేట్ అయ్యారు. చివరికి ఆమెకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం కానీ, తన జర్నీని చూసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వకపోవడం గమనార్హం.
ఇదిలావుండగా రేపు శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఫైనల్‌కు ముందు రోజు కాబట్టి ఈ రోజు సరదా సరదాగా సాగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం బిగ్‌బాస్ 6 తెలుగు గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఫైనల్‌లో ఒక అమ్మాయి (కీర్తి) , నలుగురు అబ్బాయిలు (రోహిత్, రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి) తాడోపేడో తేల్చుకోనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments