పవన్ మూవీలో నటిస్తున్న నాని హీరోయిన్..!
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇటీవల ఈ చిత్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో పవన్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఇద్దరి హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసారు.
ఈ విషయాన్ని కీర్తి సురేష్ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తుండడం పై సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రం ద్వారా యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ను టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను డిసెంబర్ నుంచి ప్రారంభించనున్నారు. నేను శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ అనతికాలంలోనే పవర్ స్టార్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకోవడం విశేషం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments