విక్రమ్ తో కీర్తి సురేష్...
Send us your feedback to audioarticles@vaarta.com
డిఫరెంట్ కథలు, కాన్సెప్ట్‌లు, గెటప్‌లతో విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న చియాన్ విక్రమ్, హరి దర్శకత్వంలో వచ్చిన సామి ఎంతటి సెన్సేషనల్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ చిత్రానికి సీక్వెల్ `సామి2` రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ తుది దశకు చేరుకుంది. సామి చిత్రంలో విక్రమ్ సరసన త్రిషను హీరోయిన్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే.
కాగా లెటెస్ట్ న్యూస్ ప్రకారం త్రిషతో పాటు కీర్తి సురేష్‌ను కూడా హీరోయిన్‌గా సెలక్ట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని కీర్తి సురేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. పవర్‌పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్‌ను డిజైన్ చేయడం డైరెక్టర్ హరిది ప్రత్యేకమైన శైళి. మరిప్పుడు సామి సీక్వెల్‌లో విక్రమ్ క్యారెక్టర్‌ను ఎలా డిజైన్ చేసుంటాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com