కీర్తి ఎక్కువ సార్లు చూసిన సినిమా అదేనట
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతున్న కథానాయిక కీర్తి సురేష్. ఈ సంక్రాంతికి విడుదల కానున్న అజ్ఞాతవాసి`, గ్యాంగ్` సినిమాలతో.. థియేటర్లలో సందడి చేయడానికి ఈ ముద్దుగుమ్మ సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య గురించి కీర్తి మాట్లాడుతూ, “గజని` సినిమాలో సంజయ్ రామస్వామి పాత్రలో సూర్య సర్‌ని చూసి చాలా భయమేసింది, కాని గ్యాంగ్` సినిమాలో కలిసి నటించాక అదొక మరచిపోలేని అనుభూతిగా ఉంది” అని వెల్లడించారు. మరో అగ్ర కథానాయకుడు విక్రమ్ గురించి మాట్లాడుతూ “నేను చియాన్ విక్రమ్‌కి చాలా పెద్ద ఫ్యాన్. ఆయన నటించిన అపరిచితుడు` సినిమా మూడు సార్లు చూసాను. థియేటర్లో అన్ని సార్లు చూసిన మూవీ అదే. ఇప్పుడు ఆయనతో కలిసి సామి స్క్వేర్` లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు. ఈమె నటించిన అజ్ఞాతవాసి` ఈ నెల 10న విడుదల కానుండగా...సూర్యతో కలిసి నటించిన గ్యాంగ్` 12వ తేదీన రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com