కీర్తి... 123!
Send us your feedback to audioarticles@vaarta.com
కీర్తి సురేష్ నటించిన తెలుగు సినిమా ఇంకా ఒకటి కూడా విడుదల కాలేదు. కానీ అప్పుడే ఆమె చేతిలో తెలుగులో మూడు సినిమాలున్నాయి. నిన్నటితరం నటి మేనక కుమార్తె కీర్తి. సీనియర్ నరేష్ కుమారుడి సరసన అడ్డాలచంటి సినిమాలో నటించింది. ఆ సినిమా ఇంకా విడుదల కాకముందే శ్రీ స్రవంతి మూవీస్ లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. నేను -శైలజ అనే ఆ సినిమాలో రామ్ కథనాయకుడు. జనవరి 1న విడుదల కానుంది.
ఆ సినిమా విడుదల కాకముందే సందీప్‌కిషన్‌తో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. సందీప్ కిషన్ హీరోగా మలయాళ హిట్ చిత్రం నేరమ్‌ను తెలుగులో అనిల్ కన్నెగంటి తెరకెక్కిస్తున్నారు. మిస్టర్ నూకయ్య సినిమా తర్వాత ఈ దర్శకుడు చేస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. పిక్సల్ ఇండియా పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. సో ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఈ మలయాళీ భామ మూడు ఆఫర్లు దక్కించుకున్నదన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments