కీర్తి.. ఈ సారి త‌క్కువే

  • IndiaGlitz, [Sunday,December 10 2017]

తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా.. మంచి విజ‌యాల‌నే మూట‌గ‌ట్టుకుంది కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్‌. నేను శైల‌జతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ చిన్న‌ది.. ఆ త‌రువాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని నేను లోక‌ల్‌తో సంద‌డి చేసింది. మ‌ళ్లీ దాదాపు ఏడాది గ్యాప్‌తో అజ్ఞాత‌వాసితో ప‌ల‌క‌రించ‌నుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుంది. అయితే.. ఆ త‌రువాత మూడు నెల‌ల‌లోపే త‌న త‌దుప‌రి చిత్రం మ‌హాన‌టితో ప‌ల‌క‌రించ‌నుంది కీర్తి.

మార్చి 29న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అంటే.. గ‌త రెండేళ్లుగా ఏడాదికో తెలుగు సినిమా అన్న‌ట్లుగా ఉన్న కీర్తి సురేష్.. ఈ సారి త‌క్కువ గ్యాప్‌తో అభిమానుల ముందుకొస్తుంద‌న్న‌మాట‌. గ‌త రెండు చిత్రాల్లో ఎలాగైతే అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర‌లే చేసిందో.. అలాగే ఈ కొత్త చిత్రాల్లోనూ ఆ త‌ర‌హా పాత్ర‌లు చేసింది కీర్తి సురేష్‌. ఇదిలా ఉంటే.. తెలుగుతో పాటు త‌మిళ చిత్రాల‌లోనూ ఈ అమ్మ‌డు బిజీగా ఉంది.

More News

మ‌ల్టీస్టార‌ర్ మూవీలో సాయిపల్లవి?

ఫిదాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ సాయిప‌ల్ల‌వి. ఆ చిత్రంలోని త‌న న‌ట‌న‌తో క‌ట్టిప‌డేసిన ఈ అమ్మ‌డు.. ప్ర‌స్తుతం నానితో ఎం.సి.ఎ సినిమా చేస్తోంది. డిసెంబ‌ర్ 21న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

శేఖ‌ర్ క‌మ్ముల హీరోల మ‌ధ్య పోటీ

ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌కి పెట్టింది పేరు.. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఈ జోన‌ర్‌లో ఆయ‌న రూపొందించిన ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా మంచి విజ‌యం సాధించాయి.

రెండొ వారంలొకి అడుగుపెట్టిన 'ఇంద్రసేన'

పక్కా కమర్షియల్ సినిమాలకు, ప్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు ఉండే ప్రధానమైన తేడా తొలివారం వసూళ్లె. టాక్ తో సంబంధం లేకుండా తొలివారం కమర్షియల్ సినిమాలు భారీ ఓపెనింగ్స్ ను సాధిస్తే.. మౌత్ టాక్ తో రొజురొజుకు పుంజుకునె ప్యామిలీ సినిమాలు లాంగ్ రన్ తో సక్సెస్ఫుల్ మూవీగా నిలుస్తున్నాయి.

కృష్ణ‌వంశీ మ‌ల్టీస్టార‌ర్‌

క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా పేరున్న కృష్ణ‌వంశీకి ఈ మ‌ధ్య కాలం క‌లిసి రావ‌డం లేదు. ఆయ‌న చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేదు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రీసెంట్ మూవీ న‌క్ష‌త్రం బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ప్లాప్ టాక్‌ను తెచ్చుకుంది.

2.0 నిర్మాత‌ల కేసు..

దాదాపు 450 కోట్ల బ‌డ్డెట్‌తో రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.