కీర్తి.. ఈ సారి తక్కువే
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా.. మంచి విజయాలనే మూటగట్టుకుంది కేరళకుట్టి కీర్తి సురేష్. నేను శైలజతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది.. ఆ తరువాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని నేను లోకల్‌తో సందడి చేసింది. మళ్లీ దాదాపు ఏడాది గ్యాప్‌తో అజ్ఞాతవాసితో పలకరించనుంది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. అయితే.. ఆ తరువాత మూడు నెలలలోపే తన తదుపరి చిత్రం మహానటితో పలకరించనుంది కీర్తి.
మార్చి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే.. గత రెండేళ్లుగా ఏడాదికో తెలుగు సినిమా అన్నట్లుగా ఉన్న కీర్తి సురేష్.. ఈ సారి తక్కువ గ్యాప్‌తో అభిమానుల ముందుకొస్తుందన్నమాట. గత రెండు చిత్రాల్లో ఎలాగైతే అభినయానికి అవకాశమున్న పాత్రలే చేసిందో.. అలాగే ఈ కొత్త చిత్రాల్లోనూ ఆ తరహా పాత్రలు చేసింది కీర్తి సురేష్. ఇదిలా ఉంటే.. తెలుగుతో పాటు తమిళ చిత్రాలలోనూ ఈ అమ్మడు బిజీగా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com