BiggBoss: శ్రీహాన్‌కు ఫేవర్‌గా శ్రీసత్య, కాలితో తన్నిన కీర్తి... ఓటమి బాధలో రేవంత్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 తెలుగు చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. మరో రెండు వారాల్లో విజేత ఎవరో తేలిపోనుంది. దీంతో కంటెస్టెంట్స్‌ను ఫైనల్‌కి తీసుకెళ్లే టికెట్ టు ఫినాలేకు బిగ్‌బాస్ శ్రీకారం చుట్టారు. ఎనిమిది మంది ఇందులో తలపడితే ఇనయా, శ్రీసత్యలు ఎలిమినేట్ అవ్వగా.. రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి, ఫైమా, రోహిత్‌లు నెక్ట్స్ రౌండ్‌కి అర్హత సాధించారు. వీరికి వరుసగా ఛాలెంజ్‌లు ఇస్తూ ఒక్కొక్కరిని పోటీ నుంచి తప్పిస్తున్నాడు బిగ్‌బాస్. అయితే చివరిలో ఒక్కొక్కరి మెంటాలిటీ భయపడుతోంది. ఇంట్లో అందరూ కలిసిపోయారు అనుకుంటున్న సమయంలో శత్రువులు మిత్రులవ్వగా.. సాఫ్ట్ అనుకున్న వారు తాము వయ్‌లెంట్ అని చూపించారు.
ముఖ్యంగా కీర్తి ఉగ్రస్వరూపాన్ని చూసి కంటెస్టెంట్స్, ఆడియన్స్ షాక్‌కు గురయ్యారు. టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో పార్టిసిపేట్ చేయడానికి రెండోసారి ఇచ్చిన అవకాశం ఇనయా, శ్రీసత్యల కారణంగా చేజారిపోవడంతో కీర్తి భగ్గుమంది. శ్రీహాన్‌కు ఫేవర్‌గా వుండి తనకు అన్యాయం చేశారంటూ ఫైర్ అయ్యింది. అంతేకాదు గేమ్ నుంచి ఎలిమినేట్ కావడంతో.. ఆ బాధను తట్టుకోలేక ఏడ్చేసింది.
టాప్‌లో లేని వారికి ఈరోజు రోల్ బేబీ రోల్ టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. దీనిలో భాగంగా దొర్లుకుంటూ వెళ్లి బ్రిక్స్ తెచ్చుకుని, మళ్లీ దొర్లుకుంటూ వచ్చి వాటిని ఒక టవర్‌లాగా నిలబెట్టాలి. ఎవరైతే బాగా ఎత్తుగా కడతారో వారు గెలిచినట్లు.. ఇందులో ఫైమా, కీర్తి, శ్రీహాన్, రోహిత్ ఆడగా...ఇనయా, శ్రీసత్యలు సంచాలక్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా శ్రీహాన్ టవర్ ఎలాంటి గ్యాప్స్ లేకుండా ఎత్తుగా వుందని, అతనే విన్నర్ అని శ్రీసత్య చెప్పింది. దీంతో కీర్తి మండిపోయింది. శ్రీహాన్ టవర్‌లో ఇన్ని గ్యాప్స్ వుంటే.. మీకు కనిపించలేదా అంటూ వాదించింది. మీకు నచ్చినవారికి ఇచ్చుకోండి అంటూ లోపలికి వెళ్లిపోయింది. అంతా కలిసి బతిమలాడినా ఆమె బయటకు రాలేదు. తర్వాత తన టవర్‌ను ఒక్క తన్ను తన్నింది. కీర్తిని ఎప్పుడూ ఇలా చూడని ఇంటి సభ్యులు షాక్‌కు గురయ్యారు.
తర్వాత గుడ్డు జాగ్రత్త అనే టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ఇందులో భాగంగా గజిబిజిదారులు దాటుకుంటూ... స్టాండ్‌పై నిలబెట్టిన గుడ్డు కిందపడకుండా చివరి వరకు వెళ్లాలి. అది కిందపడితే ఔట్ అయినట్లే. ఈ టాస్క్‌లో ఆదిరెడ్డి, ఫైమా, రేవంత్, శ్రీహాన్‌లు పోటీపడ్డారు. రేవంత్ సగం దూరం వెళ్లాక అతని గుడ్డు కిందపడిపోవడంతో కోపంతో ఊగిపోయాడు. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రేవంత్... సంచాలక్‌గా వున్న కీర్తి మనసులో ఏదో పెట్టుకుని తనను తప్పించాలని చూసిందని ఫైరయ్యాడు. నేను గెలుస్తానని భయపడి.. తన ఫోకస్ అంతా తనపైనే పెట్టిందని, నేనంటే ఆమాత్రం భయపడాలంటూ కవర్ చేసుకునేందుకు ట్రై చేశాడు.
మరోవైపు.. టికెట్ టు ఫినాలేలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన అన్ని టాస్కుల్లో ఆదిరెడ్డి 12 పాయింట్లతో ముందంజలో వుండగా... 10 పాయింట్లతో శ్రీహాన్ సెకండ్ ప్లేస్‌లో రేవంత్ 9, ఫైమా 7, రోహిత్ 6 పాయింట్లతో వరుస స్థానాల్లో వున్నారు. అనంతరం ట్రోఫి ఎందుకు గెలవాలనుకుంటున్నారో చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించగా, కంటెస్టెంట్స్ తమ మనసులోని మాటను చెప్పారు. చాలా మంది కుటుంబం కోసం ట్రోఫిని గెలవాలని చెప్పారు. గెలిస్తే తల్లిదండ్రులకు కప్‌ని అంకితమిస్తామని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments