మల్టీపుల్ స్కెలోరోసిస్‌పై అవగాహన పెంచుతోన్న కీరవాణి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సంగీత దర్శుకుడు ఎం.ఎం.కీరవాణి కరోనా వారియర్స్‌గా కరోనా నుండి కోలుకున్న వారికి పిలుపునిచ్చారు. అంతే కాదు.. ఆయనతో పాటు తనయుడు కాలభైరవతో కలిసి రెండుసార్లు ప్లాస్మాను దానం చేశారు. ఇప్పుడు మరో వ్యాధిపై అవగాహన కల్పించడానికి కీరవాణి ముందుకొచ్చారు. ఇటీవల ఆయనకు మల్టీపుల్ స్కెలోరోసిస్ సోకిందని తెలియడంతో ఆయన డాక్టర్స్ సలహాతో పాటు యోగా చేయడం, సంగీతం వినడం వంటి పనులు చేసి ఉపశమనం పొందుతున్నారు. శరీరం, మెదడు మధ్య ఉన్న అనుసంధాన్ని దెబ్బతీసే మల్టీపుల్ స్కెలోరోసిస్‌పై అవగాహన కల్పించడానికి కీరవాణి ముందుకొచ్చారు.
"ఇటీవలే ఎం.ఎస్(మల్టీపుల్ స్కెలోరోసిస్) గురించి తెలిసింది. ఇది ఏ వయసువారికైనా, ఎప్పుడైనా రావచ్చు. ఇది మన శరీరంతో మెదడుకు ఉన్న అనుసంధానంగా ఉండే వ్యవస్థను దెబ్బతీస్తుంది. కాబట్టి దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మల్టీపుల్ స్కెలోరోసిస్ సోసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ ప్రయత్నిస్తుంది. ఈ వ్యాధి గురించి ప్రభుత్వానికి తెలిసేలా అవగాహన ఉన్నవారితో తన గళాన్ని వినిపించే ప్రయత్నం చేస్తోంది. అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే.. ఈ సమస్యతో బాధపడేవారికి కుటుంబ సభ్యుల నుండి మద్దతు ఎంతో అవసరం. ధైర్యమైన మాటలు, యోగ, మంచి సంగీతం వినడం వంటి పనులతో మనోధైర్యాన్ని నింపండి" అంటూ కీరవాణి తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout