Roar of RRR: సంస్కృత రాపర్ ని రంగంలోకి దించిన కీరవాణి!
Send us your feedback to audioarticles@vaarta.com
షూటింగ్ పూర్తి కావస్తుండడంతో దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాలని షురూ చేస్తున్నాడు. షూటింగ్ పూర్తయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం కొన్ని నెలల టైం పడుతుంది. దీనితో పార్లల్ గా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి చిత్రాన్ని త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని జక్కన్న భావిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో జూలై 15న రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో పవర్ ఫుల్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. ప్రస్తుతం ఆ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇక సంగీత దర్శకుడు కీరవాణి భారీ ప్లాన్ లోనే ఉన్నారు. రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ కి సంబంధించి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
ఈ మేకింగ్ వీడియో కోసం కీరవాణి ప్రముఖ సింగర్, సంస్కృత రాపర్ బ్లాజిని రంగంలోకి దించారు. బ్లాజి స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ కోసం ఇక్కడ ఉన్నా. మమ్మల్ని ఎగ్జైట్ చేసేది జూలై 15న మీ ముందుకు వస్తుంది' అని బ్లాజి ట్వీట్ చేస్తూ కీరవాణితో ఉన్న పిక్ ని పోస్ట్ చేశాడు,
బ్లాజి రంగంలోకి దిగడంతో అభిమానుల్లో ఆసక్తి ఎక్కువైపోయింది. ఈ చిత్రంలో సంస్కృత శ్లోకం తరహాలో ఏదైనా పాటని ప్లాన్ చేస్తున్నారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే మేకింగ్ వీడియోలో ఆ సాంగ్ ని రివీల్ చేసే అవకాశం ఉంది. మొత్తగా ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే జూలై 15వరకు వేచి చూడాల్సిందే.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ లో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments