డిసెంబర్ లో విడుదలకు సిద్దమవుతోన్న 'కేడీ నెం-1'
Send us your feedback to audioarticles@vaarta.com
‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని, భారీ ఓపెనింగ్స్ రాబట్టుకున్న షకలక శంకర్ నటిస్తోన్న తాజా చిత్రం ‘కేడీ నెం`1’. జాని దర్శకత్వంలో డి.గిరీష్ బాబు నిర్మిస్తున్నారు. ఖుషీ గడ్వీ, గుర్లిన్ చోప్రా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన డిసెంబర్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత డి.గిరీష్ బాబు మాట్లాడుతూ..‘‘ `శంభో శంకర` చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న షకలక శంకర్ హీరోగా జాని దర్శకత్వంలో ‘కేడీ నెం`1’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నాను. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దర్శకుడు జాని అద్భుతంగా తెరకెక్కించారు. పూర్తి స్థాయి యాక్షన్ ఫిలిం. టీమ్ అందరి సహకారంతో సినిమాను అనుకున్న విధంగా రూపొందించగలిగాం`` అన్నారు.
దర్శకుడు జానీ మాట్లాడుతూ... ``కే.వి.వి. సత్యనారాయణగారు, వారబ్బాయి వేణుగారి సపోర్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. డైరక్టర్ గా ఇది తొలి సినిమా. నన్ను నమ్మి ఈ అవకాశం కల్పించిన నిర్మాత గిరీష్ గారికీ, హీరో శంకర్ కు నా ధన్యవాదాలు. శంకర్ కామెడీ మాత్రమే కాదు యాక్షన్ కూడా చేయగలడని మా సినిమా ద్వారా తెలుస్తుంది. నేను డిజైన్ చేసుకున్న క్యారక్టర్ కి తగ్గట్టుగా శంకర్ అద్భుతంగా చేశాడు `` అని అన్నారు.
ముఖుల్ దేవ్, జహీర్ ఖాన్, తాగు బోతు రమేష్, గబ్బర్ సింగ్ టీమ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః అజయ్ పట్నాయక్; కెమెరాః ముజీర్; కొరియోగ్రాఫర్ః శివ శంకర్ మాస్టర్; ఫైట్స్ః కృష్ణం రాజు; ప‌్రొడ్యూసర్ః డి.గిరీష్ బాబు; స‌్టోరీ- స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వంః జాని.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments