ఆడియో విడుదల సన్నాహాల్లో 'కేడి బిల్లా-కిలాడి రంగా'

  • IndiaGlitz, [Saturday,April 30 2016]

"పసంగ, మేము, కథకళి" వంటి సూపర్ హిట్ చిత్రాల ఫేం పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొంది.. ఘన విజయం సాధించిన తమిళ చిత్రం "కేడి బిల్లా-కిలాడి రంగా" అదే పేరుతో తెలుగులో అనువాదమవుతుండడం తెలిసిందే. రాజ్‌ కందుకూరి సమర్పణలో.. భీమవరం టాకీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న రెజీనా ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌ కాగా.. కోలీవుడ్‌లో లీడింగ్‌ హీరోయిన్‌గా పేరు గడించిన మన తెలుగమ్మాయి బిందుమాధవి మరో హీరోయిన్‌. విమల్‌-శివకార్తికేయన్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం యువన్‌ శంకర్‌రాజా స్వర సారధ్యం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం పాటలు ఈ వారంలో విడుదల చేసి, మే 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "రాజ్‌ కందుకూరి సమర్పణలో "కేడి బిల్లా-కిలాడి రంగా" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రెజీనా, బిందుమాధవిల గ్లామర్‌- విమల్‌, శివకార్తికేయన్‌ల పెర్‌ఫార్మెన్స్- యువన్‌ శంకర్‌రాజా సంగీతం "కేడి బిల్లా-కిలాడి రంగా" చిత్రానికి ముఖ్య ఆకర్షణలు. "పసంగ, మేము, కథకళి" వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు పాండిరాజ్ "కేడి బిల్లా-కిలాడీ రంగా" చిత్రాన్నిహిలేరియస్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దారు. ఈ వారంలో ఆడియో రిలీజ్‌ చేసి, మే 13న సినిమాను విడుదల చేయనున్నాం" అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: కృష్ణతేజ, పాటలు: పోతుల రవికిరణ్‌, ఆడియోగ్రఫి: శేషు కె.యం.ఆర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్: డా.శివ. వై. ప్రసాద్-బి.సత్యనారాయణ, మ్యూజిక్‌: యువన్‌ శంకర్‌రాజా, సమర్పణ: రాజ్‌ కందుకూరి, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌!!

More News

చిరు మూవీ ప్రారంభోత్స‌వం - ప‌వ‌న్ రాక‌పోవ‌డానికి కార‌ణం..?

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్ర ప్రారంభోత్స‌వం ఫ్యామిలీ మెంబ‌ర్స్ స‌మ‌క్షంలో ఓ పండ‌గ‌లా జ‌రిగింది. ఈ వేడుక‌కు దాదాపు ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ వ‌చ్చారు. కానీ ముఖ్య‌మైన వ్య‌క్తి త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం రాలేదు. త‌మ్ముడు ప‌వ‌న్ కోసం అన్న‌య్య చిరంజీవి స‌ర్ధార్ సెట్స్ కి వెళ్ళి సంద‌డి చేసారు.

మళ్లీ మొదలైన చిరు-బాలయ్య వార్..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఈరోజు ప్రారంభమైంది.ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

మారుతి, దిల్‌రాజు, 'రోజులు మారాయి' ఫస్ట్ లుక్‌ రిలీజ్

ఓ వైపు నిర్మాతగా భారీ చిత్రాలు నిర్మిస్తూనే... మరో వైపు డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి తెలుగు చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా... వ‌రుస విజ‌యాల ద‌ర్శ‌కుడు మారుతి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించ‌గా.... మారుతి టాకీస్ బ్యాన‌ర్ లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌హ‌-నిర్మాణం లో రూపొందిస్తుķ

సుప్రీమ్ సెన్సార్ పూర్తి మే 5 విడుదల

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా, బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా, 'పటాస్' సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతోన్న చిత్రం 'సుప్రీమ్'.

మొన్న ప‌వ‌న్ - నిన్న మ‌హేష్

మొన్న ప‌వ‌న్ - నిన్న మ‌హేష్...ఇంత‌కీ విష‌యం ఏమిటంటే....ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - ఎస్.జె.సూర్య కాంబినేష‌న్లో రూపొందిన తొలి చిత్రం ఖుషీ. ఈ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఖుషీ త‌ర్వాత ప‌వ‌న్ - సూర్య క‌ల‌సి పులి సినిమా చేసారు.